![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -380 లో..... రామలక్ష్మి రామ్ గురించి ఆలోచిస్తుంది. మరుసటి రోజు డాక్టర్ రామ్ ని చెకప్ చేస్తుంటే సీతాకాంత్ వచ్చి నేను పని మీద బయటకు వెళ్తున్నా జాగ్రత్త అని రామ్ కి చెప్తాడు. నేనంటే నీకు ఇష్టం లేదు సీతా.. నేను ఏమైనా నీకు సంబంధం లేదని రామ్ అంటాడు. అలా అంటావేంటి అని సీతాకాంత్ అంటాడు. మరి మా మిస్ ని పెళ్లి చేసుకోమంటే మీరు వినడం లేదు కదా అని రామ్ అంటాడు.
నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు అని రామ్ తో సీతాకాంత్ అంటాడు. అప్పుడే సీతాకాంత్ కి ఫోన్ వస్తుంది. అర్జెంట్ గా వెళ్తాడు. రామ్ పరిస్థితి చూసి నాకు జాలిగా ఉంది వాడి గురించి కాకుండా సీతా గురించి ఆలోచిస్తున్నాడు. వాడి కోసం అయిన మైథిలీని ఒకసారి రమ్మన్నాలని శ్రీలత అనగానే.. మీరు మైథిలీ విషయంలో మెత్తబడితే ఇప్పుడు మనకి నష్టమే.. ఒకసారి రమ్మంటే ఇక ఇంటికి కోడలుగా సెటిల్ అవుతుందని శ్రీవల్లి అంటుంది. మరొకవైపు రామలక్ష్మి రామ్ గురించి హోమం చేస్తుంది. సీతాకాంత్ ఎలాగైన రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించి ఇంటికి తీసుకొని రావాలి లేదంటే నాన్నకి ప్రాబ్లెమ్ అవుతుందని సీతాకాంత్ అనుకుంటాడు. సీతాకాంత్ ఒక దగ్గర ఆగి అమ్మవారికి మొక్కుకుంటాడు. నాకు ఈ సమస్యకి పరిష్కారం చూపించు అమ్మ అని సీతాకాంత్ వేడుకుంటాడు.
అప్పుడే సీతాకాంత్ చేతిలో పసుపు కొమ్ము పడుతుంది. నాకు అర్థమైంది అంటూ సీతాకాంత్ అనుకుంటాడు. రామలక్ష్మి దగ్గరికి వెళ్లి తన మెడలో పసుపు కొమ్ము కడతాడు సీతాకాంత్. అది చూసి రామలక్ష్మి, ఫణీంద్ర, సుశీల షాక్ అవుతారు. రామ్ కోసం తప్పదు మైథిలీ గారు అని సీతాకాంత్ అంటాడు. రామ్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటాడు. సీతాకాంత్ కి సందీప్ ఫోన్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాడని శ్రీలత అనుకుంటారు. అప్పుడే సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు మెడలో పూలదండలతో వస్తారు. వాళ్లని చూసి శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |